ASR: సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తుండడంతో డుంబ్రిగుడ మండల పరిసర ప్రాంతాలలో వాగులు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పర్యటక కేంద్రమైన చాపరాయి జలపాతం నేటి నుంచి మరొక రెండు రోజులు వరకు ప్రజల భద్రతా దృష్ట్యా మూసివేస్తున్నట్లు ఇంఛార్జ్ మేనేజర్ అప్పారావు మంగళవారం తెలిపారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని కోరారు.