భారతదేశంలో సిజేరియన్ ఆపరేషన్లు మితిమీరుతున్నాయని ‘లాన్సెట్’ నివేదిక వెల్లడించింది. WHO సిఫార్సు చేసిన పరిమితి దాటిపోయాయని పేర్కొంది. సిజేరియన్లతో తల్లి, బిడ్డకు హానికరమని తెలిపింది. సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలకు ఉబ్బసం, స్థూలకాయం, అలర్జీలు, టైప్-1 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువట. 2005లో 8.5% ఉన్న సిజేరియన్లు 2021 వరకు 21.5% పెరగటం ఆందోళనకరమని నివేదిక చెప్పింది.