E.G: ఈనెల 29వ తేదీ వరకు జిల్లాలోని బార్లు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 22 బార్లు, కల్లు గీత కార్మికులకు 3 బార్లు కేటాయించామన్నారు. వీటిలో రాజమండ్రిలో 19, కొవ్వూరులో 2, నిడదవోలులో 3, కడియపులంకలో ఒకటి ఉన్నాయన్నారు.