కర్నూలు: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దకడబూరు మండలంలోని కల్లు కుంట గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రేపు జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు పీఈటీ దుబ్బన్న తెలిపారు. హెచ్ఎం సుధాకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ఓపెన్ కేటగిరిలో బాల బాలికలు అందరూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు.