ASR: జీ.మాడుగుల మండలం గాంధీనగర్‌కు చెందిన మత్స్యరాస నాగజ్యోతి అనారోగ్యంతోనే కష్టపడి చదవింది. మెగా డీఎస్సీ ఫలితాల్లో 74.40 శాతం మార్కులు సాధించింది. ఉద్యోగం వస్తుంది, టీచర్‌గా మారి స్టూడెంట్స్ జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. కానీ ఇంతలోనే క్యాన్సర్ రూపంలో మృత్యువు ఆమెను కబలించింది. విశాఖ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతూ నాగజ్యోతి మృతి చెందింది