కృష్ణా: కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని సంఘం అధ్యక్షుడిగా అన్నే శివరామప్రసాద్ (నాని) చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొంది శివరామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.