NLG: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్వహించారు. 48 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని, ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి వేగంగా స్పందించాలని తెలిపారు.