KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో సోమవారం 3వ టౌన్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల రికార్డులను, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. నిషేధిత ప్రమాదకర వస్తువులు, మత్తు పదార్థాలు, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా రవాణా అవుతున్న గూడ్స్‌పై నిఘా పెట్టి, సోదాలు చేస్తున్నట్లు వేణుగోపాల్ తెలిపారు.