అన్నమయ్య: తంబళ్లపల్లెలో వినాయక చవితి సందడి మొదలైంది. వివిధ రూపాలు, ఆకృతులు, అలంకరణలతో ముస్తాబైన గణనాథుని ప్రతిమలను పిల్లలు, పెద్దలు, యువత ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. తంబళ్లపల్లెకు సమీపంలోని వినాయక ప్రతిమల తయారీ కేంద్రం వద్ద కొనుగోలుదారులతో పండుగ వాతావరణం నెలకొంది. రూపం, అకృతి, పరిమాణాన్ని బట్టి విగ్రహం ధరలు నిర్ణయించినట్లు తెలిపారు.