SRD: రైతులకు భవిష్యత్తులో రైతు భరోసా రాదని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఏద్దేవా చేశారు. నేడు మండల కేంద్రమైన సిర్గాపూర్‌లో BRS పార్టీ సమావేశం జరిగింది. రైతులకు అన్ని విధాల ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మోసం చేసిందని ఆరోపించారు. పూర్తిస్థాయిలో పంట రుణాలు మాఫీ చేయలేదని, రైతు భరోసా సక్రమంగా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.