KMR: సదాశివ నగర్లో భార్య హత్య కేసులో భర్తను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 22న కుటుంబ కలహాల నేపథ్యంలో రవి తన భార్యను బండరాయితో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడు చిందం రవిని పట్టుకొని రిమాండ్కు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన సదాశివనగర్ పోలీసులను ఎస్పీరాజేశ్ చంద్ర, డీఎస్పీ ఎల్లారెడ్డి శ్రీనివాసరావు అభినందించారు.