HYD: బుద్ధ భవన్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ప్రజావాణికి 48 ఫిర్యాదులు అందాయన్నారు. ప్లాట్ల పక్కన రోడ్లు, పార్కులను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారన్నారు.