AP: రాష్ట్ర ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రానికి 10,800 టన్నుల యూరియా ఒడిశా ధమ్రా పోర్టు నుంచి దిగుమతికి కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కొరత ఉన్న జిల్లాలకు యూరియా పంపాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో 15 వేల టన్నుల యూరియా వస్తుందని హామీ ఇచ్చారు. రెండో వారంలో మరో 30 వేల టన్నుల యూరియా వస్తుందన్నారు.