SRD: తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు సాయిబాబా నగర్ కాలనీలో, కొల్లూరులో రూ. 60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.