BDK: చుండ్రుగొండ మండలం వ్యవసాయ శాఖ అధికారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియాను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో brs నాయకులు పాల్గొన్నారు.