కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన శాలివాహన కులస్తులు మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. రోజుకు 200 నుంచి 300 విగ్రహాలను తయారుచేస్తూ, వాటిని హైదరాబాద్, పుణే, రాజమండ్రి, విశాఖపట్నం, ఒడిశా వంటి ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. మట్టి విగ్రహాలకు పెరుగుతున్న ఆదరణతో వారి పని పుంజుకుంది.