సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. HCL- TEC-B ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.