W.G: నిబద్ధత, అంకితభావంతో పని చేసి ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ న్యాయవాదులకు సూచించారు. ఆదివారం నరసాపురం న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు తమ న్యాయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.