ATP: శింగనమలలో ఆదివారం స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేశారన్నారు. అనంతరం కాసేపు మహిళలతో ఆమె ముచ్చటించారు.