CTR: తవణంపల్లి మండలం గాజులపల్లిలో జరుగుతున్న మహాభారత యజ్ఞానికి పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. యజ్ఞానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించారు. అనంతరం మహాభారత ప్రాంగణంలో భక్తులతో మాట్లాడారు. “మహాభారత యుద్ధం మనకు మంచి – చెడులను చూపిస్తుంది. మనం ఎల్లప్పుడూ మంచిని ఎంచుకుని మంచి మార్గంలో నడవాలి ” అని అన్నారు.