TG: బోడుప్పల్ గర్భిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘మృతదేహాన్ని మాయం చేసేందుకు భర్త అన్ని విధాలుగా ప్రయత్నించాడు. బ్లేడ్‌తో మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. విడతల వారీగా మూసీ నదిలో పారేశాడు. పోలీసులు ఇంటికి వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలి ఉంది. శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్నాం’ అని డీసీపీ పద్మజ తెలిపారు.