KRNL: ఆదోని మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వికలాంగులు పాత పద్ధతి పర్సంటేజ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో జనార్ధన్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, దుగ్గప్ప, వీరాంజనేయులు, సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, DYFI సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.