TG: ఓయూకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తానని CM రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇంజినీర్స్ కమిటీ వేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు ఆదేశాలు జారీ చేశారు. ‘దేశానికి యవనాయకత్వం అవసరం. సమస్యల చర్చకే కాదు సైద్ధాంతిక అంశాలకు కాలేజీలు వేదిక కావాలి. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చలు జరపాలి. విద్యాసంస్థల్లో చైతన్యవంతమైన చర్చలు లేకపోవటం వల్లే డ్రగ్స్ సమస్య’ అని అన్నారు.