VZM: రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు నిలువరించడమే లక్ష్యంగా నూతన వ్యవస్థ, రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించనుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. సోమవారం ఎస్.కోట గౌరిశంకర్ కాలనీలో రేషన్ డిపో వద్ద నూతన రైస్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.