SKLM: సారవకోట మండలం చీడీపూడి కోవిల వీధి సమీపంలో ఆర్అండ్ రోడ్డు చెరువును తలపిస్తోంది. ఏ మాత్రం వర్షం కురిసిన ఇక్కడ రోడ్డుపై వర్షం నీరు నిలిచి ఇలాంటి దుస్థితి ఏర్పడుతోంది. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికుల వాహనాలు టైర్లు బురదలో కూరుకుపోవడమే కాకుండా, టైర్లు జారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ శాఖాధికారులు రోడ్డును బాగు చేయాలని వీధి వాసులు విన్నవిస్తున్నారు.