కోనసీమ: మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి జన్మదిన వేడుకల్లో భాగంగా రథం సెంటర్ వద్ద ఆమె కార్యాలయంలో 140 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు సేవలు వెలకట్టలేనివని అన్నారు. రాష్ట్రంలోనే మండపేట పారిశుద్ధ్యంలో నెంబర్ వన్ గా నిలవడానికి వారు చేసిన కృషిని కొనియాడారు.