NTR: విజయవాడలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం శనివారం జరిగింది. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, ఇంజనీర్లు, ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి, ప్రకాశం బ్యారేజి నిర్మాణానికి కృషి చేసిన గొప్ప నాయకుడని ఆళ్ళ గుర్తు చేసుకున్నారు.