SKLM: జిల్లాలో దివ్యాంగులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్స్ తొలగించేందుకు కూటమి కుట్ర పన్నుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. SC/ST /BCలకు 50 ఏళ్లకు ఫించన్ హామీని గాలికి వదిలేసి దివ్యాంగుల పెన్షన్స్ తొలగించేందుకు పన్నాగం పన్నడం హేయమైన చర్య అన్నారు.