ఆసియాకప్ నేపథ్యంలో ఇటీవల బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే అనూహ్యంగా అందులో శ్రేయస్ అయ్యర్‌కు చోటుదక్కలేదు. ఈ విషయం తనను విస్మయానికి గురిచేసిందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అలాగే బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సెలక్టర్లు ఇలా చేయడాన్ని తాను ఎప్పటి నుంచో చూస్తున్నానని విమర్శించాడు.