NLR: చేజర్ల మండలం నాగులవెల్లటూరు BSRN జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండేళ్లుగా బయాలజికల్ సైన్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. HM, MEO, DEO అధికారులకు పలు మార్లు వినతులు చేసినా చర్యలు లేకపోవడంతో తల్లిదండ్రులు, SMC సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హెచ్ఎంకు వినతి పత్రాన్ని అందజేశారు.