JN: మండల కేంద్రంలోని బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల సందర్భంగా పెద్ద కాలువ ఇరుపక్కల గ్రామాల రైతులకు శనివారం సీఐ దామోదర్ రెడ్డి, ఎస్సై రాజన్ బాబు విజ్ఞప్తి చేశారు. కాలువను తెంపడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడినవారు, ప్రోత్సహించినవారు శిక్షార్హులవుతారని హెచ్చరించారు.