TG: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ-2 బ్రాంచిలో బంగారం, నగదు భారీగా అపహరణకు గురయ్యాయి. బ్యాంకు అధికారుల ఆడిట్ నేపథ్యంలో ఈనెల 21న ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత 3 రోజులుగా బ్యాంకు, పోలీసు అధికారులు విచారణ జరిపారు. రూ.12.61 కోట్ల విలువైన బంగారం, రూ.1.10 కోట్ల నగదు అపహరణకు గురైనట్లు తేలడంతో బ్యాంకు అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.