KMR: సమాచార హక్కు చట్టం భారత పార్లమెంటు చేసిన ఒక చట్టం అని సమాచార హక్కు చట్ట రాష్ట్ర డైరెక్టర్ MA సలీం అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ పౌరులు ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారాన్ని పొందేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు.