ELR: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బాలయ్య బాబుకు చోటు దక్కడం సంతోషంగా ఉందని అంబికా కృష్ణ తెలిపారు. సరైన వ్యక్తికి, సరైన సమయంలో గౌరవం దక్కిందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా అభిమానులను అలరించడంతో పాటు 15 ఏళ్లుగా బసవతారకం ఆసుపత్రి ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించిందన్నారు. బాలయ్య మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.