KRNL: అవుట్ డోర్ స్టేడియంలో ఈనెల 26న జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీలు జరగనున్నాయని జిల్లా సంఘం అధ్యక్షురాలు నంద్యాల రాధిక తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30 నుంచి భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వ్యక్తిగత కిట్‌తో పాటు ప్లేయర్ ఐడీ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు.