W.G: ప్లాస్టర్ ఆఫ్ పారీస్, రంగురంగుల వినాయక విగ్రహాలు వాడొద్దని CI కాళీ చరణ్ అన్నారు. చవితి పండుగను పురస్కరించుకుని ఎక్కడైనా సరే మట్టి వినాయకుని ప్రతిమలను పూజించాలని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ప్రచార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, పూనా రాము, SI రామారవు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.