కృష్ణా: మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ప్రత్యేకాంధ్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.