టీమిండియా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున వన్డేల్లో పునరాగమనం కోసం స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా లార్డ్స్‌లోని ఇండోర్ నెట్స్‌లో దాదాపు రెండు గంటలపాటు బ్యాటింగ్‌లో సాధన చేశాడు. ఈ క్రమంలో అతడు స్పిన్, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.