MNCL: విద్యుత్ షాక్తో గేదె మృతి చెందిన ఘటన కవ్వాల్ గ్రామంలొ చోటుచేసుకుంది. బాధితురాలు గాజుల పద్మ తెలిపిన వివరాల మేరకు.. చెరువు కట్ట పైన మేసుకుంటు వెళ్లే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్ గేదెకు తగలడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. గేదె విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరారు.