KRNL: ప్రతి ఒక్కరూ రోజూ సైకిల్ సాధన చేయాలని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి సైక్లింగ్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను అనుసరించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచనల మేరకు సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.