మహారాష్ట్రలో ఓట్ల చోరీ సమస్య 8 నెలలుగా కొనసాగుతోందని శివసేన(UBT) ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. ఈ అంశాన్ని ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, శరద్ పవార్ సహా కాంగ్రెస్ నేతలు లేవనెత్తారని తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఓట్ల చోరీ ద్వారానే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.