TG: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉచిత విద్యుత్ సదుపాయం కోసం త్వరలోనే ఒక విధివిధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై వినాయక మండపాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.