JN: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా ఖైదీ సుచరిత మృతి చెందిన ఘటనలో నర్సంపేట సబ్ జైలర్ లక్ష్మీ శృతిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 13న వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన సుచరితను నర్సంపేట మహిళా జైలుకు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 21న ఆసుపత్రిలో మృతి చెందింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలింది.