కృష్ణా: అవనిగడ్డ వాసి అలపర్తి నరేంద్ర స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 88 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. జోన్ల వారీగా నిర్వహించిన ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలో 3 జిల్లాల అభ్యర్థులు పోటీ పడగా, 83 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. అలాగే, జోన్ల వారీగా నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలో 7వ ర్యాంకు సాధించి, రాసిన మూడు పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించారు.