KMM: యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మధిర పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అన్నారు. రైతులకు ఎలాంటి షరతులు విధించకుండా పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేయాలని ఆదివారం మధిరలో జరిగిన సమావేశంలో చెప్పారు. అటు అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు.