NZB: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్మూర్ రోడ్డులోని శ్రీరామ గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అలాగే ఎంపీ అర్వింద్ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొంటారని బీజేపీ పార్టీ కార్యకర్తలు ఓ ప్రకటనలో తెలిపారు.