KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులోనీ జోసఫ్ పేట, శాంతి నగర్ వీధులలోని తాగునీటి సమస్య వుండడంతో గ్రామస్తులు సంబంధిత అధికారులకు, నాయకులకు విన్నవించారు. దీంతో వేంటనే స్పందించిన ఎమ్మెల్యేకు విషయం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో యూనిట్ ఇంఛార్జ్ తుపాకుల రమణ ఆధ్వర్యంలో 24 గంటల్లోనే బోర్లను రిపేర్ చేసి తాగునీటిని అందించారు.