BDK: భద్రాచలం తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. భద్రాచలం నుంచి సుమారు 12కి.మీ.దూరంలో ఉన్న పాండు రంగాపురం వరకు రైల్వే మార్గాన్ని విస్తరించి భద్రాచలం పాండురంగాపురం రైల్వే స్టేషన్ను నిర్మించాలనే కల దశాబ్దాలుగా నెరవేరని ఆశగా మిగిలిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో అని స్థానికులు అంటున్నారు.