NLG: పాత పెన్షన్ విధానానికై సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాను ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని పీఆర్టీయూ టీఎస్ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడు కంచరకుంట్ల సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గుండ్రాంపల్లి, పెద్దకాపర్తి పాఠశాలల్లో మహాధర్నా పోస్టర్ను సంఘం నేతలతో కలిసి ఆవిష్కరించారు.