KDP: టీడీపీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయని కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి తెలిపారు. కడపలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నియోజకవర్గాల వారిగా పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ త్వరలో పదవులు వస్తాయన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన అంశంపై ఈ సమావేశం చర్చించినట్లు పేర్కొన్నారు.